సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రియల్ లైఫ్ లో ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తారని అందరూ భావిస్తారు.అయితే సెలబ్రిటీల జీవితాలు కూడా సాధారణ వ్యక్తుల జీవితాలలా ఉంటాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో తమిళ, తెలుగు భాషల్లో ఒక సినిమాను తెరకెక్కించిన ప్రముఖ డైరెక్టర్( Young Director ) భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.ఆ సినిమా రిలీజ్ కు కొన్ని వారాల ముందే ఈ దర్శకుడి పెళ్లి జరిగింది.

పెళ్లి( Marriage ) తర్వాత సంతోషంగా ఈ దర్శకుడు జీవనం సాగిస్తాడని అందరూ భావించగా ఈ డైరెక్టర్ లైఫ్ లో ప్రస్తుతం ఊహించని ట్విస్టులు వచ్చాయని తెలుస్తోంది.ఈ దర్శకుడికి భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.పెళ్లైన ఆరు నెలలకే ఈ దర్శకుడు విడాకుల దిశగా అడుగులు వేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం.ప్రతి విషయంలో విబేధాలు రావడం వల్లే విడాకులు( Divorce ) తీసుకోవాలని ఈ జంట భావిస్తోందని తెలుస్తోంది.
చిన్నచిన్న సమస్యలు కామన్ అని వాటిని పరిష్కరించుకుంటే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.వైరల్ అవుతున్న వార్తల గురించి ఆ యంగ్ డైరెక్టర్( Tollywood Young Director ) రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.
లవ్ స్టోరీలను ఎక్కువగా తెరకెక్కించిన ఈ డైరెక్టర్ రియల్ లైఫ్ లో ఇలా జరగడం ఆయన ఫ్యాన్స్ కు షాకిస్తోంది.

యంగ్, టాలెంటెడ్ హీరోలతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ దర్శకుడికి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ఈ డైరెక్టర్ వ్యక్తిగత జీవితంలో నెలకొన్న సమస్యలు సైతం పరిష్కారం కావాలని నెటిజన్లు( Netizens ) కోరుకుంటున్నారు.







