సీపీఐ బస్సు యాత్ర ముగింపు సభలో నారాయణ సీరియస్ వ్యాఖ్యలు..!!

తిరుపతిలో సీపీఐ బస్సు యాత్ర( CPI Bus Yatra ) ముగింపు సభలో నారాయణ( CPI Narayana ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్రం పై మండిపడ్డారు.

 Narayana Serious Comments At The Closing Meeting Of The Cpi Bus Yatra Details, C-TeluguStop.com

ప్రధాని అవినీతిపరుడు. అందుకే 29 మంది అవినీతిపరులైన దత్తపుత్రులను కాపాడుతున్నారని విమర్శించారు.

తిరుమలలో( Tirumala ) మద్యం తాగకూడదు.మరి మద్యం కేసుల్లో నిందితులు టీటీడీ పాలకమండలిలో ఉండవచ్చా.? వీళ్ళు తిరుపతి పవిత్రను కాపాడతారా అని ప్రశ్నించారు.తిరుమల దేవుడుని వీళ్ళ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.

తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లను కాపాడుతున్న ప్రభుత్వం పులుల నుంచి రక్షణకు భక్తులకు కర్రలు ఇస్తే సరిపోతాయా అంటూ సీపీఐ నారాయణ.నిలదీశారు.

ఇదే సమయంలో చంద్రబాబుకి( Chandrababu Naidu ) ఐటీ నోటీసులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.దమ్ముంటే చంద్రబాబును అరెస్టు చేసి చూపించాలని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.ప్రజల సొమ్ము అప్పనంగా వేలాది కోట్లు తిన్న అవినీతిపరుడని కాపాడుతూ.చిల్లర దొంగ చంద్రబాబు అరెస్టు చేయటమా  అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.ఢిల్లీలో గ్రేట్ మోడీ అధ్యక్షతన జరుగుతున్నది జి20 సదస్సా లేదా.బీజేపీ జాతీయ సమావేశమా అంటూ ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జగన్, కేసీఆర్, మోడీ ప్రభుత్వాలను ఓడించాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube