SSMB29 : కొత్త ఏడాది కోసం వెయిట్‌ చేస్తున్న రాజమౌళి

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి( Rajamouli ) ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా రూపొందబోతున్న రాజమౌళి సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అంటూ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Rajamouli And Mahesh Babu Movie Update 3-TeluguStop.com

కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ అప్డేట్‌ అనేది లేదు.ఇక రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ తో( Vijayendra Prasad ) కలిసి స్క్రిప్ట్‌ వర్క్ చేస్తున్నాడని, అతి త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతుందని అంతా భావిస్తున్నారు.

Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Ssmb, Trivikram-Movie

అయితే రాజమౌళి ఈ ఏడాది లో మహేష్ బాబు సినిమా వర్క్ ఏమీ చేయడం లేదు అంటూ సన్నిహితుల వద్ద చెబుతున్నాడట.కథ విషయం లో( Movie Story ) తుది నిర్ణయానికి రావడానికి చాలా సమయం పడుతుందని కూడా రాజమౌళి అంటున్నాడు.మొత్తానికి ఈ ఏడాది లో రాజమౌళి ఈ సినిమా వర్క్ మొదలు పెట్టే అవకాశాలు లేవని, కొత్త ఏడాదిలోనే సినిమాను షురూ చేయాలని భావిస్తున్నట్లుగా అనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి.ఒక వేళ రాజమౌళి కనుక మహేష్ బాబుతో సినిమాను వచ్చే ఏడాది లో మొదలు పెడితే

Telugu Mahesh Babu, Rajamouli, Rajamoulimahesh, Ssmb, Trivikram-Movie

ఆ సినిమా విడుదల అయ్యేది కచ్చితంగా 2026 అంటూ ఇండస్ట్రీ లో టాక్ ఉంది.మొత్తానికి మహేష్ బాబు తో రాజమౌళి సినిమా గురించి మీడియా లో కనిపించినంత హడావిడి రాజమౌళి కాంపౌండ్ లో కనిపించడం లేదు.అలాగే మహేష్ బాబు కూడా హడావిడి తో ఏమీ లేడు.

మెల్లగానే త్రివిక్రమ్‌( Trivikram ) మూవీ ని ఫినీష్‌ చేయాలని భావిస్తున్నాడు.ఆ తర్వాత రాజమౌళి కి డేట్లు ఇవ్వబోతున్నాడు.

ఇంతకు ముందు రాజమౌళి తో వర్క్‌ చేసిన హీరోల మాదిరిగానే మహేష్ బాబు కూడా చాలా వరకు డేట్ల విషయం లో కన్విన్స్ అవ్వాలని అనుకుంటున్నాడట.రాజమౌళి అడిగినన్ని డేట్లు ఇవ్వాలని భావిస్తున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube