ఎల్లారెడ్డిపేట లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు.

ఉట్టి కొట్టిన భీమ్ యువత సభ్యులు లింగాల సన్నీ.10,116 రూపాయలు నగదు అందించిన సర్పంచ్.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) ఆధ్వర్యంలో గ్రామంలోని నంది విగ్రహం (మూడు తోవల వద్ద) ఉట్టి కొట్టే కార్యక్రమం సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఉట్టి కొట్టే కార్యక్రమంనకు ముందుగా గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ,నవీన్ పంతులు ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ భగవానుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు.

 Shri Krishna Janmashtami Celebrations In Ellareddypet , Ellareddypet , Shri Kris-TeluguStop.com

అనంతరం సర్పంచ్ వెంకట్ రెడ్డి కొబ్బరి కాయ కొట్టి ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభించారు.కార్యక్రమంలో భాగంగా మొదట సర్పంచ్ వెంకట్ రెడ్డి, ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు లాంఛనంగా ప్రారంభించారు.

ఉట్టి కొట్టే కార్యక్రమం లో పాల్గొనే వారికి ఎలాంటి దెబ్బలు తగలకుండా కింద ఉనుక పోశారు.ఉట్టి కొట్టే సమయంలో ఉట్టి కొట్టే వారికి రంగు నీళ్లను చల్లారు.

ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామ పాలక వర్గం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు.ఇట్టి ఉట్టి నీ స్థానిక జై భీమ్ యువత సభ్యులు లింగాల సన్నీ కొట్టారు.

ఉట్టి కొట్టిన యువతకు స్థానిక సర్పంచ్ వెంకట్ రెడ్డి 10,116 రూపాయల నగదును అందజేశారు.అనంతరం డీజే చప్పుళ్ళు మధ్య యువత చిన్న పెద్ద బేధం లేకుండా నృత్యాలు చేశారు.

చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు తేడా లేకుండా గ్రామానికి చెందిన వారే కాకుండా వేరే గ్రామాలకు చెందిన వారు సుమారు 2000 ల మంది ఉట్టి కొట్టే కార్యక్రమం ను కనులారా తిలకించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్,వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మి నారాయణ,మాజీ ఎంపీటీసీ లు నేవూరీ రవీందర్ రెడ్డి,ఒగ్గు బాలరాజు యాదవ్, నేవూరి సురేందర్ రెడ్డి,నూకల శ్రీనివాస్ యాదవ్,లింగపురం ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు ఎనగందుల బాబు,గ్రామస్తులు,జై భీమ్ యువత సభ్యులు పాల్గొన్నారు.

ఉట్టి కొట్టిన లింగాల సన్నీని స్థానిక ఉపసర్పంచ్ దంపతులు ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ లు శాలువాతో సన్మానించారు .ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ పండగలు అంటే మా సర్పంచ్ వెంకన్న అని,వెంకన్న అంటే పండగలు అని వారు కొనియాడారు.ఇలాంటి పండగలు చేయడంలో జిల్లాలో ఉన్న సర్పంచ్ లు మా సర్పంచ్ కు ఎవరు కూడా సరి తూగరని గ్రామ ప్రజలు అన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube