ఉమ్మడి కరీంనగర్ ( Karimnagar ) జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం అంటే చాలా ఫేమస్.ఈ నియోజకవర్గంలో ప్రత్యేక తెలంగాణకు ముందు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేది.
ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.ఈ తరుణంలో మానకొండూరు ( Manakondur ) నియోజకవర్గ సీటు గాయకుడు రసమయి బాలకిషన్ కు కేటాయించింది అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం.
దీంతో రసమయి బాలకిషన్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది.ఈ తరుణంలో రసమయి బాలకిషన్ కు 2018 ఎన్నికల్లో 88997 ఓట్లు పడితే, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆరెపల్లి మోహన్ కు 57,488ఓట్లు పడ్డాయి.
దీంతో అత్యధిక మెజారిటీతో రసమయి బాలకిషన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన రసమయి బాలకిషన్( Rasamayi Balakishan ) కు మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం సీటు ప్రకటించింది.కట్ చేస్తే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆరెపల్లి మోహన్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.బిఆర్ఎస్ తరఫున రసమయితో చాలా ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ వస్తున్నారు.
ఆయన బిఆర్ఎస్ లో చేరిన సందర్భంలో అధిష్టానం ఆయనకు ఈసారి టికెట్ కేటాయిస్తుందని ఆశపడ్డారు.కానీ చివరికి 115 మందితో లిస్టు ప్రకటించిన సందర్భంలో అందులో ఆరెపల్లి మోహన్ ( Arepalli Mohan ) పేరు లేకపోవడంతో ఆయన మోసపోయారని గ్రహించారు.
చేసేదేమీ లేక చాలా అసంతృప్తితో బాధపడుతున్నారట.అంతేకాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.కెసిఆర్ తనకి ఎలాగైనా సీటు కేటాయిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనకు చివరికి బిఆర్ఎస్ మొండి చేయి చూపించడంతో నడి సముద్రంలో ఆగిపోయిన నావల తయారయింది ఆయన పరిస్థితి.దీంతో ఆరెపల్లి మోహన్ మరో పార్టీ వైపు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఆయన తన పార్టీ అనుచరులతో సమావేశమైనట్టు తెలుస్తోంది.త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటో ప్రకటించే అవకాశం కనబడుతోంది.అయితే ఆరెపల్లి మోహన్ కు మానకొండూరులో మంచి ఫాలోయింగ్ ఉంది.ఒకవేళ ఆయన రాజీనామా చేసి మరో పార్టీకి వెళ్తే మాత్రం అక్కడ బిఆర్ఎస్ ( Brs ) కు దెబ్బ పడ్డట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తప్పనిసరిగా ఆరేపల్లి మోహన్ వర్గం బిఆర్ఎస్ కు సపోర్ట్ చేయదని, దీనివల్ల అక్కడ బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అనూహ్యంగా బలపడే అవకాశం ఉందని రాజకీయ మేధావులు తెలియజేస్తున్నారు.మరి చూడాలి ఆరెపల్లి మోహన్ ను కేసీఆర్( KCR ) బుజ్జగిస్తారా.
మనకెందుకులే అని వదిలేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.ఇప్పటికే ఆరెపల్లి మోహన్ కోసం బిజెపి (BJP) ఇతర పార్టీలు సంప్రదింపులు జరపడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.







