'గుంటూరు కారం' లో పవన్ కళ్యాణ్..ఇక తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోవాల్సిందే!

టాలీవుడ్ లో నేటి తరం స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు మహేష్ బాబు కి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వీళ్లిద్దరి ప్రభంజనం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.

 Pawan Kalyan In 'guntur Karam' Telugu States Should Tremble , Pawan Kalyan, Gunt-TeluguStop.com

రెండు తెలుగు రాష్ట్రాల్లో యూత్ మొత్తం 2012 నుండి 2016 వరకు వీళ్లిద్దరి నామమే జపం చేసింది.అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళ సొంతం.

బాక్స్ ఆఫీస్ పరంగా వీళ్లిద్దరి మధ్య రికార్డ్స్ వార్ అభిమానుల ద్వారా సోషల్ మీడియా లో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరు ఒకరినొకరు ఎంతో ఇష్టపడుతారు.

ముఖ్యంగా మహేష్ బాబు( Mahesh Babu ) గత పదేళ్ల నుండి పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూనే ఉన్నాడు.పవన్ కళ్యాణ్ కూడా ఈమధ్య కాలం లో మిస్ కాకుండా మహేష్ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాడు.

Telugu Arjun, Guntur Karam, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan, Trivikram-Mo

వీళ్ళ స్నేహం నిన్న మొన్న ప్రారంభం అయ్యింది కాదు.ఎప్పుడో అర్జున్ సినిమా ( Arjun movie )సమయం నుండే ఉంది.అప్పట్లో అర్జున్ సినిమా పైరసీ అయితే టాలీవుడ్ లో అందరి హీరోల కంటే ముందు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు తో పాటు ప్రెస్ మీట్ కి వచ్చి కూర్చొని సపోర్ట్ చేసాడు.ఈ విషయాన్నీ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ మహేష్ బాబు ఎన్నో సార్లు గుర్తు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

అలాగే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు.అప్పట్లో ఈ విషయం ఒక సంచలనం అనే చెప్పాలి.

అయితే ఇప్పుడు మహేష్ బాబు చేసిన ఆ సహాయానికి బదులుగా పవన్ కళ్యాణ్ కూడా ఒక సహాయం చెయ్యబోతున్నాడు అని టాక్.ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ ( Guntur karam )అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.

Telugu Arjun, Guntur Karam, Mahesh Babu, Pawan Kalyan, Pawankalyan, Trivikram-Mo

ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా సాగుతుంది.వచ్చే ఏడాది జనవరి 12 వ ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.రీసెంట్ గానే త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చెయ్యగా, ఆయన వెంటనే ఒప్పుకొని వాయిస్ ఓవర్ ఇతను అని మాట ఇచ్చాడట.

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలన గా మారింది.విడుదలకి ముందే ఇన్ని అద్భుతాలు సృష్టించిన ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube