నల్లగొండ జిల్లా: నిడమనూర్ మండలం( Nidamanur ) ముకుందాపురం నుండి తుమ్మడం వైపు వెళ్లే ప్రధాన రహదారిపైకోటమైసమ్మ గుడి సమీపంలోని మూల మలుపు దగ్గర గత కొన్ని నెలల క్రితం ముదిమానిక్యం మేజర్ అర్-15 కెనాల్ మరమ్మత్తుల కొరకు పెద్ద గుంత తవ్వి పూడ్చకుండా వదిలేయడంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని,సమీపంలోనే కోట మైసమ్మ అమ్మవారి( Kota Mysamma Temple ) టెంపుల్ ఉండడంతో మొక్కలు తీర్చుకునేందుకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిపోతూ ఉంటారని,మూల మలుపులో పెద్ద గుంత ఉండడంతో చూసుకోక ప్రమాదాలకు గురయ్యే( Devotees ) అవకాశం ఉందని వాపోతున్నారు.
ప్రమాదకరంగా మారిన ఈగుంతతో ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు చర్యలు చేపట్టక పోవడంవారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబధిత అధికారులు స్పందించి పనులు త్వరిగతిన పూర్తి చేసి, ప్రజలను ప్రమాదాల బారినుండి కాపాడాలి కోరుతున్నారు.