సోషల్ మీడియా వల్ల ప్రజలు తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడం సులభతరం అయింది.అందుకే వీరు తమకున్న ప్రత్యేకమైన ప్రతిభను ప్రదర్శించడానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చూస్తున్నారు.
నిజానికి మంచి ప్రతిభ ఉంటే వారికి సోషల్ మీడియాలో గుర్తింపు సులభంగానే వస్తుంది.నెటిజన్లు వీరి టాలెంట్‌ను ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు.
కాగా తాజాగా ఒక యువతి ఒక అరుదైన ప్రతిభను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంటోంది.ఆమె టాలెంట్‌ను చూపించే ఒక వీడియోను @tanishafreestyler అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ తాజాగా షేర్ చేసింది.
షేర్ చేసిన వెంటనే ఇది వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఓ మాల్‌లో టీనేజ్ అమ్మాయి ఫుట్‌బాల్‌తో ఫ్రీస్టైల్ స్టంట్స్ చేయడం కనిపిస్తుంది.ఆ తర్వాత ఫుట్‌బాల్‌ను( Football ) ఈ యువతి తన తలపై నుంచి, కాళ్ల సందుల నుంచి సునాయాసంగా తిప్పుతూ ఆకట్టుకుంటుంది.అక్కడున్న వారంతా ఈ యువతి చేస్తున్న స్టంట్స్ చూసి మంత్రముగ్ధులయ్యి అలాగే చూస్తుంటారు.
ఈ దృశ్యాలను యువతి ఫ్రెండ్స్ వీడియో రికార్డ్ చేశారు.ఈ వీడియోకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.ఆమె స్కిల్స్, పబ్లిక్‌గా స్టంట్స్( Her skills, stunts in public ) చేయగల ఆమె కాన్ఫిడెన్స్ చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.కొందరు నెటిజన్లు ఆమె స్కిల్స్ చూసి తాము స్టన్ అయ్యామని కామెంట్లు పెట్టారు.మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్కేయండి.ఇకపోతే కర్ణాటకలోని ఓ ఆలయంలో ఏనుగు ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో మరో వీడియో వైరల్‌గా మారింది.గిరిజ అకా మహాలక్ష్మి అనే ఏనుగుకు ఇద్దరు వ్యక్తులు ఫుట్‌బాల్ ఆడేలా ట్రైనింగ్ ఇచ్చారు.
అయితే ఆ ఆటను బాగా ఇష్టపడ్డ సదరు ఏనుగు రోజూ రెండు గంటలపాటు క్రీడలు ఆడుతుంటుంది.







