టాలీవుడ్ హీరో రామ్ పోతినేని( Ram Pothineni ) హీరోగా నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్.ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.2019లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు అటు రామ్ పోతినేని కెరియర్లో ఇటు పూరి జగన్నాథ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయటంతో ఈ సినిమా సీక్వెల్ పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ సినిమాను దర్శకుడు పూరి అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది.

ప్రస్తుతం హీరో రామ్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమా పూర్తి చేసుకొని డబల్ ఇస్మార్ట్( Double Ismart ) షూటింగ్ లో పాల్గొంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ సినిమా హిందీ రైట్స్ నిమిత్తం పూరి భారీగా డిమాండ్ చేస్తున్నారని సమాచారం.ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డబల్ ఇస్మార్ట్ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ ను పూరి జగన్నాథ్ 20 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.
అయితే భారీ మొత్తంలా కనిపించిన కూడా పూరి, రామ్ కాంబినేషన్ లో వస్తున్న మరో యాక్షన్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సేల్ అవుతుందని అంటున్నారు.

అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్( Sanjay Dutt ) ఈ సినిమాలో నటించటం మరో విధంగా కలిసి వచ్చే అంశం.ఇక ఇస్మార్ట్ శంకర్ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ కు ఏడు కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా హిందీలో డబ్ అయినా కూడా అద్భుత విజయం సాధించింది.దీనితో డబల్ ఇస్మార్ట్ సినిమా పై అక్కడ భారీ అంచనాలు వున్నాయి.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







