చిత్ర పరిశ్రమకు ఎన్నో రకాల పురస్కారాలు ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.చిత్ర పరిశ్రమలో కొనసాగే సెలబ్రిటీలను అభినందిస్తూ ఈ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోని తాజాగా 69వ జాతీయ అవార్డు( National Awards ) లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్( Alluarjun ) ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు అందుకున్నారు.
ఇలా ఈ సినిమాకు అవార్డు రావడంతో చాలామంది జాతీయ అవార్డుల పట్ల పలు వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి.కొందరు ప్రేక్షకుల అభిమానమే మాకు ముఖ్యం కానీ అవార్డుల గురించి తమకు ఏమాత్రం పట్టదు అంటూ కామెంట్ చేశారు.
మరి కొంతమంది హీరోలు అవార్డులు నాకు చెత్తతో సమానమని ఈ అవార్డులపై కామెంట్ చేశారు.అయితే నేచురల్ స్టార్ నాని( Nani )సైతం జై భీమ్ సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంతో నా గుండె ముక్కలైంది అంటూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సంచలనంగా మారింది.అంటే బన్నీకి అవార్డు రావడం నానికి ఇష్టం లేదా అంటూ పెద్ద ఎత్తున ఈ పోస్ట్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే తాజాగా జాతీయ అవార్డుల గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై నటుడు రానా( Rana )స్పందించారు.
ఆదివారం సైమా అవార్డ్స్ ( Siima Awards )కు సంబంధించి ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో రానా మాట్లాడుతూ అవార్డులపై కాంట్రవర్సీలు ఏం లేవని అన్నాడు.సినిమాల విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్క విధంగా ఉంటాయని తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో నటించే నటీనటుల ప్రతి ఒక్క సినిమా అందరికీ నచ్చాలని రూలేమీ లేదు.
పలానా సినిమాకి కూడా వచ్చి ఉంటే బాగుంటుందని కోరుకుంటారు కానీ రాలేదు.అల్లు అర్జున్ కు ఎందుకొచ్చిందన్నది కాదని రానా తెలిపాడు.ఆ ఉద్దేశంతో హీరోలు ఎవరూ పోస్ట్‌లు, ట్వీట్‌లు పెట్టలేదని రానా చెప్పాడు.ఏ ఆర్టిస్టు సెలబ్రిటీ కూడా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి పోస్టులు చేయరని మీరే వివాదాస్పదం చేస్తున్నారు అంటూ మీడియా పై రానా సెటైర్స్ వేస్తూ తన స్నేహితుడికి మద్దతు తెలుపుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.