ఈ ప్రపంచంలో స్విగ్గీ, జొమాటో( Swiggy, Zomato ) గురించి తెలియనివారు వుండరు.ఎందుకంటే ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు( Food delivery companies ) అనేవి అంతలా జనల్లోకి వెళ్లిపోయాయి.
దానికి కారణం ఒక ఐడియా.నేటి దైనందిత జీవితంలో మనుషులకు బయటకి వెళ్ళి తినే తీరిక లేకపోతోంది.
ఈ విషయాన్నే ఆయా కంపెనీలు క్యాష్ చేసుకున్నై.ఈ విషయంలో వందశాతం సఫలం అయ్యాయి.
మరీ ముఖ్యంగా యూత్ ఈ ఐడియాకి ఆకర్షితులయ్యారు.ఎందుకంటే వారికి రుములలో వంట చేసుకొని డ్యూటీలకు, కాలేజీలకు వెళ్లాలంటే ఒకింత చాకిరితో కూడుకున్న పని.అప్పుడే జొమాటో, స్విగ్గీ బైకులు అందరికీ ప్రత్యామ్నాయం అయ్యాయి.

మొదట్లో ఇవి సర్వీస్ బాగా ఇచ్చినప్పటికీ రానురాను ఆ సర్వీస్ అనేది మందగించిదనే చెప్పుకోవాలి.మరోవైపు ఆఫర్లు….మొదట్లో ఆఫర్లు పెట్టి జనాలను వురించే ఆయా కంపెనీలు ఇపుడు చేతులెత్తేసాయి.
అవి మాత్రం ఎంతవరకు ఆఫర్లు ఇస్తాయనుకోండి.అదే విధంగా ధర విషయంలో మాత్రం చాలా మంది వినియోగదారులు పెదవి విరుస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో.ఈ 2 సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ డెలివరీ శాఖను ప్రారంబించింది.
దాని పేరే ONDC.అంటే.
ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్( open network for digital commerce ).ఇది పరిశ్రమల అంతర్గత వాణిజ్య ప్రమోషన్ కోసం.ఓపెన్ ఈ-కామర్స్ను అభివృద్ధి చేయడం కోసం.ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖ.

కేంద్ర ప్రభుత్వం దీనిని 2022లోనే స్టార్ట్ చేసింది.ఫుడ్తో పాటు గ్రాసరీలు, క్లీనింగ్ వస్తువులు, హోం డెకర్స్ లాంటివి డెలివరీ చేస్తుంది.ఈ ఓఎన్డీసీని 2022 సెప్టెంబర్లో బెంగళూరులో లాంఛ్ చేయడం జరిగింది.ఇప్పుడు వివిధ నగరాలకు విస్తరించి.స్విగ్గీ, జొమాటోలకు గట్టి పోటీ ఇస్తోంది అంటే నమ్మి తీరాల్సిందే.ఓఎన్డీసీ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫార్మ్ ఎందుకు వాడాలంటే ఇతర సంస్థల కన్నా ఇక్కడ తక్కువ ధరకే ఆహారం లభిస్తుంది.ఒక్కో ఆర్డర్పై రూ.50 నుంచి 70 వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి.దీనికోసం మీరు మొదట మీ మొబైల్లో పేటీఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.అనంతరం యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో ఓఎన్డీసీ అని టైప్ చేయండి.అప్పుడు ఆ పేజీలో మీకు గ్రాసరీల నుంచి ఫుడ్ డెలివరీ వరకు అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.ఒకవేళ మీకు ఫుడ్ ఆర్డర్ చేయాలనిపిస్తే.
ONDC ఫుడ్ మీద ప్రెస్ చేయండి.అక్కడినుండి ప్రాసెస్ మీకు తెలుసు.