హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది.అక్కాతమ్ముడిపై గుర్తు తెలియని ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.ఈ క్రమంలో తమ్ముడు చికిత్స పొందుతూ మృతి చెందగా అక్క పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కాతమ్ముడు షాద్ నగర్ కు చెందిన సంఘవి, చింటుగా గుర్తించారు.