హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన మూవీలు.. ఇందులో కూడా డార్లింగ్ నే ఫస్ట్..

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి( Tollywood ) ఈ ఏడాదిలో చాలా విజయాలు వచ్చాయి.హిట్ అయినా అన్ని సినిమాలు కలెక్షన్స్ పరంగా బాగానే వసూళ్లు చేసాయి.

 Tollywood Box Office Collection 2023 Adipurush Bhola Shankar Waltair Veerayya Br-TeluguStop.com

మరి ఈ సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలు ఏంటో తెలుసా? 2023 ఏడాదికి గాను ఇప్పటి వరకు ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మరి ఈ లిస్టులో టాప్ లో ఉంది మాత్రం ఆదిపురుష్( Adipurush ) అనే చెప్పాలి.

ఆదిపురుష్ సినిమా హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి టాప్ 1 లో నిలిచింది.ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 135 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి.అయితే ఆ తర్వాత సినిమా ప్లాప్ అయ్యింది.ఇక రెండవ స్థానంలో బాలయ్య ”వీరసింహారెడ్డి” సినిమా( Veerasimha Reddy ) నిలిచింది.

ఈ సినిమా మొదటి రోజు 50 కోట్ల గ్రాస్ అందుకుంది.

ఆ తర్వాత మెగాస్టార్ వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) 49.5 కోట్ల గ్రాస్ అందుకుంది.ఇది చిరు కెరీర్ లో కూడా హైయెస్ట్ గ్రాస్ మూవీ.

ఇక పవన్ కళ్యాణ్ బ్రో సినిమా( Bro Movie ) 49 కోట్లు, ఆ తర్వాత నాని దసరా మూవీ( Dasara ) 38 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నాయి.టైర్ 2 హీరోల్లో నాని ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టి టాప్ లో నిలిచాడు.

ఆ తర్వాత దసరా 100 కోట్లను కూడా దాటేసింది.

ఇక మెగాస్టార్ భోళా శంకర్( Bhola Shankar ) మూవీ కూడా 29 కోట్ల గ్రాస్ మాత్రమే అందుకుంది.కానీ ఇది అట్టర్ ప్లాప్ అయ్యింది.ఆచార్య తర్వాత మెగాస్టార్ భోళా శంకర్ తో మరో ప్లాప్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఇప్పుడు ఖుషి సినిమా( Kushi Movie ) 27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను మొదటి రోజు అందుకుని ఈ లిస్టులో చేరిపోయింది.ఖుషి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది.

ఇది కూడా 100 కోట్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube