తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ ( Akkineni Family ) గురించి అందరికీ ఎంతో సుపరిచితమే ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ ఉన్నటువంటి ఈ కుటుంబానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోడలుగా అడుగు పెట్టారు అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి వివాహం జరిగిన మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకుని విడిపోయారు.

ఈ విధంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ ఇప్పటికీ వీరి గురించి వీరి విడాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.ఇక సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో నాగార్జున ( Nagarjuna ) వీరి విడాకులపై స్పందిస్తూ వారి నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పారు.ఇక సమంత ఎక్కడ ఉన్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ నాగార్జున తెలిపారు.
ఇక ఆ క్షణం నుంచి సమంత( Samantha ) గురించి నాగార్జున ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఆమె భయంకరమైనటువంటి మయోసైటిస్ వ్యాధికి గురైన కూడా కనీసం సోషల్ మీడియా వేదికగా తాను బాగుండాలని కోరుకున్న దాఖలాలు కూడా లేవు.
అయితే మొదటిసారి నాగార్జున సమంత గురించి ప్రశ్నించారు.అసలు సమంత గురించి నాగార్జున ఇప్పుడు మాట్లాడటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే మరి కొద్ది గంటలలో బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7) కార్యక్రమం మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.అయితే ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు.

ఇక ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ రావడంతో నా వేదికపై ఉన్నటువంటి నాగచైతన్య ఏది మీ హీరోయిన్ సమంత ఎక్కడ? అంటూ తన మాజీ కోడలు గురించి నాగార్జున ప్రశ్నించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇలా విడాకుల తర్వాత మొదటిసారి నాగార్జున తన మాజీ కోడలు గురించి ప్రశ్నించడం గమనార్హం.ప్రస్తుతం బిగ్ బాస్ సెవెన్ లాంచింగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే సమంత మాత్రం ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.







