తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూరి జగన్నాథ్ ( Puri Jagannadh )ఒకరు ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలను అందించి మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఈ మధ్య కాలంలో పూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాలు కాస్త నిరాశ పరుస్తున్నాయని చెప్పాలి.
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి లైగర్(Liger )సినిమా తీవ్ర నిరాశపరిచింది.పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఈయన తన తదుపరిచిత్రాన్ని రామ్ పోతినేని( Ram Pothineni ) తో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా డబల్ ఇస్మార్ట్ శంకర్( Double Ismart Shankar )అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన( Janaganamana )సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే.ముందుగా ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో చేయాలనుకున్నారు.
అయితే అది కుదరడం లేదు.

అనంతరం ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )ను ఫిక్స్ చేశారు.ఈ సినిమా షూటింగ్ పనులను కూడా మొదలుపెట్టింది ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే( Pooja Hegde ) హీరోయిన్గా ఎంపిక చేశారు.ఈ సినిమా షూటింగ్ పనులు మొదలైన కొద్ది రోజులకే లైగర్ సినిమా విడుదలయ్యి డిజాస్టర్ కావడంతో జనగణమన సినిమా పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది.
అయితే తాజాగా పూరి జగన్నాథ్ మరోసారి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నారు.అయితే ఇందులో తిరిగి విజయ్ దేవరకొండ నటిస్తారా లేక మరే హీరో అయినా నటిస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈసారి పూరి జగన్నాథ్ బాలీవుడ్ హీరోతో ఈ సినిమా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.







