సాధారణంగా ఆన్‌లైన్‌లో( Online Order ) ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరొకటి రావడం కామన్.అయితే ఒక్కోసారి విలువైన వస్తువులు ఆన్‌లైన్ లో ఆర్డర్ పెడితే వాటికి బదులుగా సబ్బులు, ఇటుకలు వంటివి వస్తుంటాయి.
వీటివల్ల ఆర్డర్ చేసిన వాళ్లు షాక్ అవుతుంటారు.అయితే అంతకంటే ఎక్కువ షాక్ ఇచ్చే ఒక ఘటన నార్త్ అమెరికాలోని మెక్సికో( Mexico ) దేశంలో చేసుకుంది.
మెక్సికోలోని ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్‌ను( Smart Phone ) ఆర్డర్ చేశాడు, కానీ ఫోన్ అందుకునే బదులు, ప్యాకేజీలో హ్యాండ్ గ్రెనేడ్( Hand Grenade ) వచ్చింది.ఆ వ్యక్తి తల్లి ఆ ప్యాకేజీని తెరిచి చూడగా గ్రెనేడ్ కనిపించింది.దాంతో ఆమె షాక్ అయ్యింది.ఈ విషయం తెలిసి సదరు వ్యక్తి కూడా స్టన్ అయ్యాడు.అది ఎక్కడ పేలిపోతుందోనని భయంతో గజగజ వణికి పోయాడు.దాన్ని చాలా దూరంగా పెట్టి పోలీసులను పిలిచాడు.
బాంబు స్క్వాడ్ వచ్చి గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేశారు.గ్రెనేడ్ ఎవరు పంపారు, ఎందుకు పంపారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గ్రెనేడ్‌ను అందుకున్న వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు.అతను ఫోన్ ఆర్డర్ చేసిన ఆన్‌లైన్ స్టోర్ కూడా తెలియ రాలేదు.దోపిడీ, ఉగ్రవాదం లేదా సరదాగా గ్రెనేడ్‌ను పంపించారా అన్న కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి.2018లో యునైటెడ్ స్టేట్స్‌లోని( USA ) ఒక మహిళ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ప్యాకేజీకి బదులుగా మెయిల్‌లో బాంబు వచ్చింది.బాంబు పేలడానికి ముందే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగి దానిని స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉన్నందున పెద్దగా పేరు లేని ఆన్‌లైన్ సైట్స్ నుంచి దేన్నీ ఆర్డర్ పెట్టకూడదు.