కాంగ్రెస్ తో చర్చలు కొలిక్కి వచ్చాయని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు.ఈ క్రమంలోనే సోనియాగాంధీతో జరిపిన చర్చలను బయటపెట్టడం సరికాదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలా పని చేయాలనే దానిపై సోనియాతో చర్చించినట్లు షర్మిల తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉన్న విధంగా ప్రతి పార్టీపై కూడా ఉందని షర్మిల స్పష్టం చేశారు.రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలనను ఏ విధంగా అంతం చేయాలనే దానిపై సోనియాగాంధీతో సుదీర్ఘంగా చర్చించామన్నారు.
అందరూ అనుకుంటున్నట్లు చర్చలు తుది దశకు వచ్చాయని షర్మిల వెల్లడించారు.







