సాధారణంగా ఆడవారు కొన్నేళ్లకు ఒకసారి జుట్టు కత్తిరించుకుంటారు.లేదంటే పొడవాటి జుట్టుతో ఇబ్బంది పడక తప్పదు.
అయితే టేనస్సీకి చెందిన టమీ మనీస్( Tami Manis ) అనే మహిళ మాత్రం 33 ఏళ్లుగా హెయిర్ కట్ చేయించుకోకుండా జుట్టు పెంచుతోంది.దాంతో ఆమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముల్లెట్‌ను( Longest Female Mullet ) కలిగి ఉంది.
ముల్లెట్ అనేది ఒక హెయిర్‌స్టైల్.ఈ హెయిర్‌స్టైల్ లో జుట్టును ముందు, ఇరు వైపులా చిన్నదిగా కట్ చేస్తారు, కానీ వెనుక భాగంలోని జుట్టును అలాగే కట్ చేయించకుండా ఉంచుతారు.
దీనివల్ల ముందు భాగంలో కాకుండా వెనుక భాగంలోని జుట్టు బాగా పెరుగుతుంది.దీనిని పెంచడంలోనూ ఇబ్బంది ఉంటుంది.

టమీ మనీస్ జుట్టు 5 అడుగుల, 8 అంగుళాల పొడవు లేదా దాదాపు 172 సెంటీమీటర్లు పొడవు ఉంది.అంటే దాదాపు ఆరడుగుల పొడవు.ఆమె టిల్ ట్యూస్డే అనే ఒక మ్యూజిక్ వీడియో చూసిన తర్వాత జుట్టు కట్ చేసుకోకూడదని నిర్ణయించుకుంది.అలా 1990 నుంచి దానిని పెంచుతోంది.అప్పటి నుంచి ఆమె జుట్టు కత్తిరించుకోలేదు.తన ముల్లెట్( Mullet ) చాలా పొడవుగా ఉందని, దానిని జడ లాగా వేసుకోకపోతే మేనేజ్ చేయడం చాలా కష్టమని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.

తన హెయిర్ తన సిగ్నేచర్ హెయిర్ స్టైల్ ( Signature Hair Style ) అని, అందుకు గర్వపడుతున్నానని కూడా చెప్పింది.చాలాసార్లు మీడియాలో ఆమె తన జుట్టు కారణంగా కనిపించింది.దాని గురించి ఈవెంట్లలో మాట్లాడటానికి కూడా ఆమెను ఆహ్వానించారు.ఈ అమెరికా మహిళ అత్యంత పొడవైన ఫిమేల్ ముల్లెట్‌ను కలిగి ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను( Guinness World Record ) కూడా గెలుచుకుంది.
అయితే తాను జుట్టును పొడవుగా పెంచుకోగలడానికి తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ (Genes)యే కారణమని చెబుతోంది.







