షాపింగ్ చేస్తే రూ.కోటి మీ సొంతం.. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్

కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్‌ను ప్రవేశపెడుతూ ఉంటుంది.కొత్తగా అనేక పథకాలను ప్రారంభిస్తూ ఉంటుంది అందులో భాగంగా.

 If You Shop, Rs. Crore Is Yours Central Government's New Scheme, Gst Incentive S-TeluguStop.com

తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో అదిరిపోయే స్కీమ్ తీసుకొచ్చింది.షాపింగ్ చేస్తే రూ.కోటి గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Telugu Crore Lucky, Scheme, Gstincentive, India, Upload, Latest-Latest News - Te

సెప్టెంబర్ 1 నుంచి మేరా బిల్ మేరా అధికార్ ( Mera Bill Mera Adhikar )పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక ఇన్‌వాయిస్ ఇన్సెంటివ్ స్కీమ్( Invoice Incentive Scheme ) ను అమల్లోకి తీసుకురానుంది.ఈ స్కీమ్ ద్వారా సామాన్య ప్రజలకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.రూ.200 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఏవైనా వస్తువుల కొనుగోలు చేసినప్పుడు వాటి జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయడం ద్వారా రూ.కోటి వరకు క్యాష్ ప్రైజ్ పొందవచ్చు.ఇందుకోసం లక్కీడ్రా తీస్తారు.ఈ లక్కీ డ్రాలో గెలుపొందినవారికి రూ.కోటి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.జీఎస్టీ ఇన్‌వాయిస్‌లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది.

Telugu Crore Lucky, Scheme, Gstincentive, India, Upload, Latest-Latest News - Te

ప్రజలు ఏవైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇన్‌వాయిస్‌లను తీసుకోవాలి.కానీ చాలామంది ఇన్ వాయిస్ లను తీసుకోరు.దీంతో ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పధకం తీసుకొచ్చింది.

తొలుత అస్సాం, గుజరాత్, హర్యానా, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూలో ఈ ప్రైజ్ మనీ స్కీమ్ ను ప్రకటించింది.త్వరలోనే దేశంలోనే మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించనుంది.

మేరా బిల్ మేరా అధికార్ మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ లోకి వెళ్లి బిల్లును అప్ లోడ్ చేయాలి.ఒక నెలలో గరిష్టంగా 25 ఇన్ వాయిస్‌లను అప్ లోడ్ చేయవచ్చు.

బిల్లు అప్ లోడ్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది.దానిని లక్కీ డ్రా కోసం ఉపయోగిస్తారు.

గత నెలలో జారీ చేసిన జీఎస్టీ ఇన్‌వాయిస్‌లను వచ్చే నెల 5వ తేదీలోపు అప్ లోడ్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube