ఒకప్పుడు టాలీవుడ్ ( Tollywood )స్టార్ హీరో, నెంబర్ 1 హీరో, నెంబర్ 2 హీరో అంటే కొన్ని పేర్లు ప్రధానంగా వినిపించేవి.దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ స్టార్ హీరోగా నెం.1 గా మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు.ఆయన ఇప్పటికి కూడా సీనియర్ హీరోల్లో నెం.1 అనడంలో సందేహం లేదు అంటూ అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.ఇక ఆ తర్వాత స్థానంలో బాలకృష్ణ ( Balakrishna) ఉండేవారు, ఇప్పటికి కూడా ఆయనే ఉన్నారు.కానీ యంగ్ స్టార్ హీరోల విషయం లో నెం.1 ఎవరు అనేది క్లారిటీ రావడం లేదు.ఒక సారి మహేష్ బాబు అంటే మరో సారి పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఇప్పడు ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ ( Allu Arjun )ల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు రావడం తో ఎలాంటి డౌట్ లేకుండా ఆయన అభిమానులు మా హీరోనే నెం.1 అంటూ ప్రటించుకున్నారు.

సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఈ విషయమై వారు ప్రచారం చేసుకుంటున్నారు.పుష్ప సినిమా( Pushpa movie ) తో పాన్ ఇండియా విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు జాతీయ స్థాయి అవార్డును( National level award ) అందుకున్న కారణంగా కచ్చితంగా అల్లు అర్జున్ నెం.1 హీరో అంటూ వారు బలంగా వాదిస్తున్నారు.ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఏ ఒక్కరు కూడా జాతీయ అవార్డును అందుకోలేదు.అందుకు కూడా తెలుగు సినిమా పరిశ్రమ లో నెం.1 హీరో కచ్చితంగా అల్లు అర్జున్ అంటూ వారు బలంగా చెబుతున్నారు.అల్లు అర్జున్ యొక్క నటన ప్రతిభ ను చూపించిన సినిమా పుష్ప.ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 రాబోతున్న విషయం తెల్సిందే.కనుక పుష్ప 2 సినిమా తో కూడా బన్నీ తన సత్తా చాటుతాడు.అందుకే ఆయన టాలీవుడ్ నెం.1 అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.ఆకట్టుకునే నటన ప్రతిభ ఆయన సొంతం అవ్వడం వల్లే టాలీవుడ్ నెం.1 అంటూ అభిమానులు అంటున్నారు.







