ఏపీలో టీడీపీ నేత నారా లోకేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ప్రజాగళంగా మారిందని ఆ పార్టీ నేత దేవినేని ఉమ అన్నారు.రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా దోపిడీమయంగా మారిందని విమర్శించారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నిప్పులగుండంలోకి నెట్టారని దేవినేని ఉమ తీవ్రంగా మండిపడ్డారు.గతంలో దండగ అన్న పట్టిసీమ నేడు దిక్కు అయిందని తెలిపారు.
పంపులు పీకుతాం.పట్టిసీమ దండగ అన్న జగన్, వైసీపీ నేతలు ముక్కు నేలకు రాయాలని దేవినేని డిమాండ్ చేశారు.
నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనం అయిందని ఆరోపించారు.రానున్న ఎన్నికల్లో టీడీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







