విదేశీ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి అనుమతి లభించింది.ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిని మంజూరు చేసింది.
యూకేలో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు వెళ్లేందుకు గానూ అనుమతి ఇవ్వాలని కోరుతూ సీఎం జగన్ కోర్టులో అనుమతి కోరిన విషయం తెలిసిందే.అటు విజయసాయిరెడ్డి పలు దేశాలకు చెందిన యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని కోర్టును కోరారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు సీఎం జగన్ కు అనుమతి లభించింది.అదేవిధంగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు నెల రోజులపాటు విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిని ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.







