'అర్జున్ రెడ్డి' కాంబో మరోసారి రిపీట్.. ఇదే జరిగితే పూనకాలే!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘‘ఖుషి”.ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది.

 Arjun Reddy Combo To Repeat Again, Vijay Devarakonda , Khushi Movie, Samantha-TeluguStop.com

అందుకే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విజయ్ ఫ్యాన్స్ అంతా ఖుషి సినిమా కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నారు.లైగర్ ( Liger )వంటి ప్లాప్ తర్వాత విజయ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా ఇదే.

ఇదైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

ఇక ముందు నుండి ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాల్సిందే.ఇదిలా ఉండగా తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా యూనిట్ సభ్యులు విజయ్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.మైత్రి మూవీ బ్యానర్స్ వారిని విజయ్ తో మరో సినిమా నిర్మించాలి అనుకుంటే ఎటువంటి ప్రాజెక్ట్ ఎంచుకుంటారు అని ఒక అభిమాని అడిగారు.దీంతో వీరు సమాధానంగా మాకు విజయ్ తో మరోసారి సినిమా నిర్మించాలని ఉందని.

అది కూడా విజయ్, సందీప్ వంగ ( Sandeep Reddy Vanga )కాంబోలో నిర్మించాలనే ఆశ ఉందని అన్ని కలిసి వస్తే తప్పకుండ మూవీ భారీ స్థాయిలో ఉంటుందని మైత్రి నిర్మాత తెలిపారు.దీంతో అర్జున్ రెడ్డి వంటి కాంబో మరోసారి తెరమీదకు వస్తే ఈసారి రికార్డులు బద్దలవ్వడం ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube