బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) ఇటీవలే ‘పఠాన్‘( Pathaan ) సినిమాతో హిట్ అందుకుని ఇదే ఊపులో ”జవాన్’‘ సినిమా చేస్తున్న విషయం విదితమే.ఈ సినిమాతో తన సక్సెస్ ను కొనసాగించాలని తహతహ లాడుతున్నాడు.
షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”.

ఈ సినిమా హిందీలో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.ఈసారి షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నాడు.ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగా పెరిగాయి.
చూస్తుంటే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా( Jawan Movie )తో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకునేలానే కనిపిస్తున్నాడు.రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు.

తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.షారుఖ్ ఖాన్ లాంచ్ చేసిన ఈ ట్రైలర్ అన్ని ఎలిమెంట్స్ తో పెర్ఫెక్ట్ గా అట్లీ మార్క్ తో ఉంది.ఇటీవల వచ్చిన ప్రివ్యూతో పర్వాలేదు అనిపించుకున్న ఈసారి ట్రైలర్ మాత్రం ఎమోషన్స్, కామెడీ వంటి అంశాలతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ను బాగా జోడించినట్టు అనిపిస్తుంది.విజయ్ సేతుపతిని కూడా నెవర్ బిఫోర్ రోల్ లో చూపించినట్టు అనిపిస్తుంది.
మొత్తంగా జవాన్ సినిమాతో షారుఖ్, నయనతార( Nayanthara ) జోడీ సూపర్ హిట్ కొట్టడం ఖాయం.ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంటుంది.అలాగే ఈ మధ్య వచ్చిన ట్రైలర్స్ తో ది బెస్ట్ అని ఆడియెన్స్ చెబుతున్నారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.
చూడాలి ఎలాంటి హిట్ అందుకుంటుందో.







