హైదరాబాద్ లోని హైదర్ గూడలో జిమ్ ట్రైనర్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ మేరకు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా జిమ్ ట్రైనర్ రాహుల్ సింగ్ కేసును విచారణ చేస్తున్నారు.
మృతుడు రాహుల్ సింగ్ గతంలో ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, అయితే విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.ఇదే సమయంలో రాహుల్ సింగ్ కు మరో యువతితో ఎంగేజ్ మెంట్ అయింది.
దీంతో రాహుల్ వద్ద నుంచి డబ్బులు లాగేందుకు ప్రియురాలు, ఆమె తల్లి ప్లాన్ చేశారని పేర్కొన్నారు.ఇందులో భాగంగానే అజార్ అనే వ్యక్తితో కలిసి ప్రియురాలు రాహుల్ సింగ్ ను బెదిరింపులకు గురి చేసింది.ఈ క్రమంలోనే మ్యాటర్ సెటిల్ చేస్తానన్న అజార్ రాహుల్ వద్ద రూ.4 లక్షలు నొక్కేశాడని వెల్లడించారు.ఈనెల 24న అజార్, రాహుల్ సింగ్ మధ్య గొడవ జరిగిందన్న పోలీసులు తన డబ్బులు ఇవ్వాలని అజార్ ని రాహుల్ డిమాండ్ చేశారు.ఈ గొడవ జరిగిన ఆరు రోజులకే రాహుల్ హత్య జరిగిందని వెల్లడించారు.