వైరల్: రాయల్ ఎన్‌ఫీల్డ్ ని ఒక్క కిక్‌లోనే స్టార్ట్ చేసిన 84 ఏళ్ల వృద్ధుడు!

రాయల్ ఎన్‌ఫీల్జ్ బుల్లెట్ బైక్( Royal Enfield Bullet Bike ) గురించి యువతకి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.1950-60లలోని బాగా పాపులర్ అయిన ఈ బైక్ నేటికీ యువతకి కలల వాహనమే.ఇక అది రోడ్డుమీద డుగ్గు డుగ్గు మంటూ వెళుతుంటే ఎవరైనా సరే కళ్లగప్పించి చూడాల్సిందే మరి.ఇక అలాంటి బైక్‌ను ఎనిమిది పదుల వయసున్న పండు ముదుసలి నడుపుతుంటే.ఎలా ఉంటుంది? అబ్బే మేము ఊహించలేము అని అంటారా? అయితే మీరు ఈ స్టోరీ ఖచ్చితంగా చదవాల్సిందే.రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఫస్ట్ కిక్‌లో( First Kick ) స్టార్ట్ చేయాలంటే యూత్‌కే ఒక్కోసారి కష్టతరం అవుతుంది.మరి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇంకెంత కష్టమో ఆలోచించండి?

 84-year Old Man Who Started Royal Enfield With One Kick Details, Viral, Latest N-TeluguStop.com

కానీ ఇతను దానికి మినహాయింపు అనుకోవచ్చు.ఆ విషయం ఇక్కడ వైరల్ అవుతోన్న 84 ఏళ్ల వృద్ధుడుని( 84 Years Old ) చూస్తేనే మనకి అర్ధం అయిపోతుంది.అవును, ప్రస్తుతం వింటేజ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌ను ఈజీగా స్టార్ట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఇకపోతే చెన్నైకి( Chennai ) చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు దాదాపు వందేళ్ల చరిత్ర కలిగి ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఎలాగైనా కొనాలనేది ఈ కాలం యువతకే కాదు.గత 60-70 ఏళ్ల క్రితం ఉన్న యువతకి కూడా యమా క్రేజ్ అంటే మీరు ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు.

అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను మంచి ఫిజికల్ ఫిట్‌నెస్‌ ఉన్న యువకులు, పెద్దవారు మాత్రమే ఉపయోగిస్తారు.ఎందుకంటే దానిని తోలాలంటే కాస్త కళాపోషణ ఉండాలండోయ్… అదేనండి, మనిషి దిట్టంగా ఉండాలి మరి.లేదంటే దాని బరువుని మేనేజ్ చేయడం ఒకింత కష్టమే.కానీ ఇప్పటికీ వాడుకలో ఉన్న 1969 నాటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350( Royal Enfield Bullet 350 Bike ) బైక్‌ను ఓ వృద్ధుడు ఈజీగా స్టార్ట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడం విశేషం.

అదే ఆ వీడియో ప్రత్యేకత.ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ వృద్ధుడి వయసు 84 ఏళ్లు కావడం.అదే ఇక్కడ హాట్ టాపిక్ అయింది.దాంతో నెటిజనం ఆ విడియోపైన రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఓపెన్ గా చెప్పాలంటే ఆ వీడియో చూసి యువత సిగ్గుపడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube