పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన ‘బ్రో ది అవతార్( Bro The Avatar )’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని దక్కించుకోలేకపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే.మొదటి నుండి ఈ చిత్రం పై రీమేక్ నెగటివిటీ విపరీతంగా ఉండేది.
దానికి తోడు అసలు డైరెక్టర్ గా క్రేజ్ లేని సముద్ర ఖని( Samuthirakani ) ఈ ప్రాజెక్ట్ ని డీల్ చెయ్యడం వల్ల ఫ్యాన్స్ లో కనీస స్థాయి అంచనాలు కూడా ఏర్పడలేదు.ఇక సినిమా విడుదలైన తర్వాత కూడా చివరి 20 నిమిషాలు తప్ప అసలు స్టోరీనే లేదని టాక్ భయంకరంగా వచ్చింది .రివ్యూస్ చాలా చెత్తగా వచ్చింది, మౌత్ టాక్ కూడా నెగటివ్ గానే వచ్చింది.కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకి మొదటి మూడు రోజులు సూపర్ హిట్ రేంజ్ వసూళ్లు వచ్చాయి.
అందరూ ఆశ్చర్యపోయారు, ఈ చిత్రానికి ఇంత వసూళ్లు ఎలా వచ్చాయి అని.
ఫుల్ రన్ లో 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముఖ్య పాత్ర పోషించాడు, కమర్షియల్ ఎలెమెంట్స్ లేని సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లిమిటెడ్ రేంజ్ లో చేసి ఉంటే కచ్చితంగా కమర్షియల్ గా సూపర్ హిట్ అని అనిపించుకునేది.కానీ అలా చెయ్యలేదు, సినిమా రేంజ్ కి మించి వంద కోట్ల రూపాయలకు బిజినెస్ చేసాడు.
ఫలితంగా నష్టాలు వచ్చాయి.అయితే రీసెంట్ గానే క్లోసింగ్ కలెక్షన్స్ కూడా వేయబడిన ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.
తెలుగు తో పాటుగా హిందీ, తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల చెయ్యగా అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది.తెలుగు వెర్షన్ టాప్ 1 లో ట్రేండింగ్ అవుతుండగా, హిందీ వెర్షన్ టాప్ 2 లో ట్రెండింగ్ అవుతుంది.
హిందీ వెర్షన్ కచ్చితంగా ఎక్కువ రోజులు ట్రెండింగ్ అవుతుందని, ఇప్పటి వరకు బ్రో హిందీ వెర్షన్ కి 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇదే రేంజ్ లో ఒక వారం రోజులు కొనసాగితే కచ్చితంగా ఫుల్ రన్ లో వంద మిలియన్ వ్యూస్ వస్తాయని అంటున్నారు.అదే కనుక జరిగితే హిందీ వెర్షన్ లో #RRR తర్వాత వంద మిలియన్ వ్యూస్ ని దక్కించుకున్న ఏకైక సినిమా గా బ్రో చిత్రం నిలిచిపోతుంది.థియేట్రికల్ పరంగా పెద్దగా ఆదరణ దక్కించుకోకపోయినా ఓటీటీ లో మంచి ఆదాహరణ దక్కించుకోవడం ఫ్యాన్స్ కి కాస్త ఊరటని ఇస్తుంది.






