సినిమా పరిశ్రమలో కొత్తగా కెరీర్ ను స్టార్ట్ చేసే నటీనటులకు హిట్లు చాలా అవసరం.హీరోయిన్ల విషయంలో ఇది కాస్త ఎక్కవ.
ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాలు చేసి కనుమరుగైపోవడం మనం చూస్తూనే ఉన్నాం.మొదటి సినిమా ప్లాప్ అయ్యిందంటే అనుమానులు మొదలవుతాయి.
రెండో సినిమా కూడా ప్లాప్ అయ్యిందంటే ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు.కెరీర్ స్టార్టింగ్ లో మంచి హిట్స్ అందుకున్నా పూజ హెగ్డే, రష్మిక ( Rashmika Mandanna )లను కూడా వరుసగా రెండు మూడు ఫ్లోప్స్ రాగానే ఐరన్ లెగ్ అనేస్తున్నారు.
మరి ఇదే పరిస్థితి కెరీర్ స్టార్టింగ్ లో వస్తే? ఇలాంటి పరిస్థితే వచ్చిపడింది ఈ యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య( Sakshi vaidya ) కి.

సాక్షి వైద్య నటించిన మొదటి చిత్రం “ఏజెంట్“.( Agent )అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన భారీ బడ్జెట్ ఆక్షన్ ఎంటర్టైనర్.ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు.
మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు.భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం అఖిల్ కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచింది.
ఇక సాక్షి నటించిన రెండో చిత్రం గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna ).ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్.ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.ప్రొడ్యూసర్లకు సుమారు 20 కోట్ల నష్టం మిగిల్చింది.
ఇలా సాక్షి నటించిన రెండు చిత్రాలు డిజాస్టర్లుగా మిగలడం వలన ఇప్పుడు ఈ హీరోయిన్ కెరీర్ చిక్కుల్లో పడింది.ఇక ఈమెకు అవకాశాలు రావడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఐతే ఈ ఐరన్ లెగ్ అనే టాగ్ హీరోయిన్ లకు తగిలించడం ఎంత వరకు సమంజసమో అర్ధం అవ్వడం లేదు.ఏజెంట్ సినిమాలో సాక్షి పాత్ర నిడివి చాలా తక్కువ.ఆమె తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది.కేవలం కథలో బలం లేకపోవడం మరియు డైరెక్షన్ లోపలవలన ప్లాప్ ఐన సినిమా ఏజెంట్.ఆ సినిమా ప్లాప్ అవ్వడం వలన హీరోయిన్ కు ఐరన్ లెగ్ అనే టాగ్ వెయ్యడం కరెక్ట్ అంటారా?
.






