మామూలుగా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు కచ్చితంగా అందులో యాక్షన్ సన్నివేశాలు కోరుకుంటారు ప్రేక్షకులు.స్టార్ హీరోల నుండి యాక్షన్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు.
అందుకే స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు దర్శకులు యాక్షన్ సన్నివేశాలప్పుడు స్పెషల్ కేరింగ్ తీసుకుంటూ ఉంటారు.ఇక కొన్ని కొన్ని సార్లు యాక్షన్ సన్నివేశాలలో డూప్ లను తీసుకుంటే మరికొన్నిసార్లు స్టార్ హీరోలు రియల్ గా కూడా ఫైట్ చేస్తూ ఉంటారు.
అయితే డూప్ లేకుండా హీరోస్ చేయాలి అంటే హీరోస్ కి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు.ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో కూడా డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva ) స్పెషల్ ట్రైనర్స్ ను పెట్టినట్లు తెలుస్తుంది.
ఇంతకు అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటుడుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు.ఒక నటుడు గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ కు మంచి గౌరవం ఉంది.
ఇక ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉన్నాడు.అంతేకాకుండా సమాజ సేవలో కూడా పాల్గొంటాడు.

ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి చిన్న వయసులోనే అడుగు పెట్టాడు.చిన్నవయసులోనే పలు సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకొని ఆ తర్వాత హీరోగా ఎదిగాడు.అంతేకాకుండా బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షో లలో వ్యాఖ్యాతగా చేసి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఏడాది కిందట విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకొని మరింత అభిమానాన్ని పెంచుకున్నాడు.
ఇక ప్రస్తుతం తను డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తుంది అంతేకాకుండా సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉంది.ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్లను చూసి నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెంచుకున్నారు.అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త ట్విట్టర్ లో బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్ ఉంటుందని.ఇక ఇందులో ఉండే సీన్స్ కోసం ఎన్టీఆర్ కు ముంబై నుంచి ట్రైనర్లు వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవ్వటంతో ఎన్టీఆర్ అభిమానులు.ఆ సీన్ ఎంతలా ఉంటుందో అని కలలు కంటున్నారు.మొత్తానికి ట్రైనర్లు వచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు అంటే.ఆ సీన్ చూస్తే ఫ్యాన్స్ కి రచ్చే అని చెప్పొచ్చు.







