పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
అయితే పవన్ కళ్యాణ్ ది రెండు పడవల ప్రయాణం అని చెప్పవచ్చు.ఎందుకంటే ఒకవైపు సినిమాలలో రాణిస్తూనే మరొకవైపు రాజకీయంగా కూడా ఎదగాలని ఆయన తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇక పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి దాంతో సినిమాలో చేస్తున్నట్లు ఆయన స్వయంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికలకు ముందు సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందుకో మనసు మార్చుకున్నారు.కమ్ బ్యాక్ ప్రకటించారు.గత మూడేళ్ళలో పవన్ కళ్యాణ్ నుండి మూడు సినిమాలు విడుదల అయ్యాయి.
కాగా ఇవి మూడు కూడా రీమేకులే.వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ( Vakil Saab, Bhimla Naik, Bro )ఆయన ఇమేజ్ కి సరిపడని సబ్జక్ట్స్.
దీంతో ఫలితం కూడా సోసో గానే ఉంది.బ్రో డిజాస్టర్ కాగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ స్వల్ప నష్టాలతో బయటపడ్డాయి.
అయితే రీమేక్ సినిమాలు వద్దు అని అభిమానులు ఎంత మొట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం వినడం లేదు.స్ట్రైట్ మూవీ హరి హర వీరమల్లును అక్కడే పెట్టి రెండు రీమేక్స్ చేసి వదిలాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో మరో రీమేక్ సిద్ధం అవుతుంది.

ఇది తేరీ రీమేక్.హరీష్ శంకర్( Harish Shankar ) మార్క్ మార్పులు చేర్పులతో తెరకెక్కిస్తున్నారు.పవన్ కళ్యాణ్ రీమేక్స్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం తక్కువ సమయంలో పూర్తి కావాలి.
రాజకీయంగా ఆయనకు సౌలభ్యం కలిగించాలి.దాదాపు సెట్స్ లో పూర్తి చేయాలి.విదేశీ షెడ్యూల్స్ గట్రా ఉండకూడదు.20 రోజులు షూటింగ్ చేసినా 50 రోజులు షూటింగ్ చేసినా ఆయనకు రావాల్సిన రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేయాలి.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సురేందర్ రెడ్డి దర్శకుడిగా రామ్ తళ్లూరి నిర్మాతగా ఒక మూవీ ప్రకటించారు.అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా కార్యరూపం దాల్చలేదు.ఇక రామ్ తళ్లూరికి పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉండగా విక్రమ్ వేద రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట.ఈ క్రమంలో విక్రమ్ వేద రీమేక్ లో పవన్, రవితేజ నటించే అవకాశం ఉంటుందని సమాచారం.







