తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress party ) యమ దూకుడు మీద కనిపిస్తోంది.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న హస్తం పార్టీ బిఆర్‌ఎస్ కు గద్దె దించేందుకు ఉపయోగ పడే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.
అందుకే పొత్తుల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది హస్తం పార్టీ.అందులో భాగంగానే వామపక్షాలతో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్నటి వరకు బిఆర్‌ఎస్ తో పొత్తులో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాయి.ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని టి కాంగ్రెస్ ( Telangana Congress )భావిస్తోందట.
![Telugu Bjp, Brs, Congress, Manikrao Thakre-Latest News - Telugu Telugu Bjp, Brs, Congress, Manikrao Thakre-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/Congress-party.-BRS-party-BJP-party-Manikrao-Thakre-CPI-CPM.jpg)
అందుకే పొత్తు విషయమై ఇటీవల కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాక్రే( Manikrao Thakre ) వామపక్ష నేతలతో భేటీ అయ్యారు కూడా.అయితే ఆ భేటీ కమ్యూనిస్ట్ పార్టీలు కోరిన సీట్ల విషయంలో కాంగ్రెస్ కొంత తటపటాయిస్తోందని తెలుస్తోంది.మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం వంటి నియోజిక వర్గాలను తమకు కేటాయించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే మునుగోడు, హుస్నాబాద్ నియోజిక వర్గాలను ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీగా ఉన్నప్పటికి కొత్తగూడెం, బెల్లంపల్లి నియోజిక వర్గాలను ఇచ్చేందుకు సుముఖంగా లేదని సమాచారం.
![Telugu Bjp, Brs, Congress, Manikrao Thakre-Latest News - Telugu Telugu Bjp, Brs, Congress, Manikrao Thakre-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2023/08/Congress-party.-BRS-party-BJP-party-Manikrao-Thakre-CPI.jpg)
దీంతో వామప్క్షలతో పొత్తు ఉంటుందా లేదా అనేది సందేహంగా మారింది.అయితే తాజాగా మరోసారి కాంగ్రెస్ నుంచి వామపక్షలకు పిలుపు వచ్చింది.ఈ నేపథ్యంలో మరోసారి సీట్ల పంపకల విషయంలో పునఃఆలోచించే అవకాశం ఉంది.అయితే వామకాశాలు కోరిన నాలుగు సీట్లను కాంగ్రెస్ కేటాయిస్తే సొంత పార్టీ నేతల నుంచి అసంతుప్తి పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే కొత్తగూడెం, బెల్లంపల్లి నియోజిక వర్గాల్లో హస్తం పార్టీకి బలమైన నేతలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో హస్తం పార్టీ పొత్తు కోసం సీట్లు త్యాగం చేస్తుందా లేదా అనేది చూడాలి.