బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని ఆయన ఆరోపించారు.
బీజేపీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.కాంగ్రెస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ డబ్బులు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ లో చేరతారన్న ఆయన బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికి బీ- ఫామ్ లు రావని తెలిపారు.అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్న బండి సంజయ్ రానున్న ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







