హైదరాబాద్ నగరం ఇప్పుడు అత్యంత సేఫ్ సిటీ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్న ఆయన తెలంగాణ ఏర్పడిన తరువాత 20 వేల పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి వేముల పేర్కొన్నారు.రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు.
తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్లకు స్వర్గధామమన్న మంత్రి వేముల బీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని వెల్లడించారు.తాము చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.