తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వైరల్ గా మారుతున్న పేరు మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ బిఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరవేసిన మొట్టమొదటి ఏకైక నాయకుడు.అలాంటి మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావు పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
హరీష్ రావు ( Harish rao )నువ్వెంత నీ బతుకెంత మెదక్ నీ కీపా అంటూ మాట్లాడారు.ఆ విషయంలో నీ ప్రమేయం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.
ఈ విధంగా ఒక్కసారిగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మైనంపల్లి తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో పార్టీలో కల్లోలం మొదలైంది.

క్రమశిక్షణ చర్యల కింద మైనంపల్లి పై వేటు వేయాలని బిఆర్ఎస్( BRS ) భావిస్తోంది.ఈ తరుణంలోనే మైనంపల్లి సరికొత్త ప్లాన్ చేసినట్టు సమాచారం.ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్( Congress ) పెద్దలు అయినటువంటి జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తో( Venugopal ) టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం అందుతుంది.
అయితే కాంగ్రెస్ లో కూడా ఆయన రెండు టికెట్లు అడిగినట్లు సమాచారం.దీనికి కాంగ్రెస్ ఆయనకు మాత్రమే టికెట్ ఇస్తానని,తన కొడుకుకి పార్లమెంటు టికెట్టు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇదే తరుణంలో మైనంపల్లి హనుమంతరావు మరో ప్లాన్ కూడా వేసినట్టు తెలుస్తోంది.

తనలాగే బిఆర్ఎస్ పార్టీలో కొంతమంది వ్యక్తులు టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్నారు.వారికి కూడా గాళం వేసి అందరిని బయటకు లాగే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం అందుతుంది.ఇందులో ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం లోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్( Nakka prabhakar goud ) కంటోన్మెంట్ స్థానంలో మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజు జితేందర్ నాథ్, అంతేకాకుండా నర్సాపూర్ స్థానంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డిని( Madan reddy ) కూడా మైనంపల్లి హనుమంతరావు కలిసి కాంగ్రెస్ లోకి రావాలని ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం.
ఇక మైనంపల్లి హనుమంతరావు రాజకీయం చివరికి ఏ వైపు దారి తీస్తుందో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







