కాంగ్రెస్( Congress ) పార్టీలో గల్లి నుంచి ఢిల్లీ వరకు ఎప్పుడు గొడవలు సాగుతూనే ఉంటాయి.ఇక ఎలక్షన్స్ ముందు అయితే టికెట్ నీకా నాకా అనే విధంగా ఓకే పార్టీ నేతలు కొట్టుకోవడం చాలా నియోజకవర్గాల్లో చూసాం చూస్తున్నాం.
తాజాగా హుస్నాబాద్( Husnabad ) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ.ఇప్పటికే ఈ పార్టీ నుంచి అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు.
ప్రాంత ప్రజలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి.అయితే గత ఎన్నికలు ముగిశాక బిఆర్ఎస్ లోకి వెళ్లిన అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి గత కొన్ని నెలల క్రితం రేవంత్ రెడ్డి ( Revanth reddy ) టిపిసిసి అధ్యక్షులు అయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి మళ్ళీ అరంగేట్రం చేశారు.
ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.ఇప్పటికే 85 గ్రామాలు చుట్టి కాంగ్రెస్ కార్యకర్తలను మరియు నాయకులను తట్టి లేపారు.బిఆర్ఎస్( BRS ) కు పోటీ ప్రవీణ్ రెడ్డి అనే విధంగా తయారయ్యారు.ఈ క్రమంలోనే పొన్నం ఎంట్రీ ఇచ్చారు.పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) కూడా హుస్నాబాద్ ప్రజలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి.ఈయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.ఇదే తరుణంలో ఆయన కూడా హుస్నాబాద్ టికెట్ పై ఆశ పడుతున్నట్టు తెలుస్తోంది. హుస్నాబాద్ లో ఇప్పటికే బీఆర్ఎస్,కాంగ్రెస్ నువ్వా నేనా అనే విధంగా తయారయ్యాయి.ఇదే తరుణంలో కాంగ్రెస్ లో ఏర్పడిన అనిచ్చితి ఏ వైపు దారి తీస్తుందో తెలియదు.
అంతేకాకుండా ప్రవీణ్ రెడ్డి( Praveen reddy ) వెంట తిరిగినటువంటి చాలామంది అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు ఏ నేతకు సపోర్ట్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.మరి ఈ సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.