గర్భిణికి సిజేరియన్ చేసిన నర్సు.. తర్వాత ఏం జరిగిందంటే..!

ప్రభుత్వ ఆసుపత్రులలో( Govt Hospitals ) అన్ని మౌలిక వసతులు, ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కానీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం పేషంట్ల ప్రాణాలను తీస్తున్నాయి.సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు చేయాల్సిన పనులను నర్సులు( Nurse ) చేయడం వల్ల చాలామంది పేషెంట్లు ప్రాణాలను కోల్పోతున్నారు.

 Baby Died After A Nurse Performed A Caesarean At The Jangaon District Government-TeluguStop.com

ఇలాంటి కోవలోనే డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీకి సిజేరియన్( Caesarean ) చేసే డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సు సిజేరియన్ చేసి పండంటి బిడ్డను చంపేసిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.జనగామ జిల్లాలోని( Jangaon District ) పాలకుర్తి గవర్నమెంట్ ఆసుపత్రికి స్రవంత్రి( Sravanthi ) అనే గర్భిణి ప్రసవం కోసం వచ్చింది.సిజేరియన్ చేసి కడుపులో బిడ్డను బయటకు తీయాల్సిన డాక్టర్ సమయానికి అందుబాటులో లేడు.దీంతో హాస్పిటల్ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ సిజేరియన్ చేసింది.

కడుపులోని బిడ్డను బయటకు తీసే క్రమంలో పొరపాటున బిడ్డ ప్రాణాలను తీసేసింది.దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఆస్పత్రి సూపరింటెండ్ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితురాలు కుటుంబ సభ్యులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Telugu Baby Delivery, Baby, Caesarean, Jangaon, Nurse, Nurse Cesarean, Staffnurs

బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.బుధవారం స్రవంతి పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆసుపత్రికి తీసుకువచ్చామని, నార్మల్ డెలివరీ అవుతుందని ఆసుపత్రి సిబ్బంది చెప్పారని తెలిపారు.అయితే బుధవారం రాత్రి పురిటి నొప్పులు అధికం అవడంతో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆ సమయంలో నైట్ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ ఆసుపత్రికి రాకపోవడంతో స్టాఫ్ నర్స్ సరితతో( Staff Nurse Saritha ) పాటు మరి కొంత మంది హాస్పిటల్ సిబ్బంది గర్భిణి స్రవంతికి సిజేరియన్ చేశారు.

Telugu Baby Delivery, Baby, Caesarean, Jangaon, Nurse, Nurse Cesarean, Staffnurs

కడుపులో నుండి బయటకు తీసిన పసిబిడ్డలో చలనం లేకపోవడంతో భయపడిపోయి వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే శిశువు చనిపోయిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు.నర్స్ సిజేరియన్ చేయడం వల్లనే పసిబిడ్డ చనిపోయిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాధిత మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారకులైన నర్సు తో పాటు వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండ్ లికిత పూర్వక హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించి, ఆందోళన విరమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube