ఆసియా కప్ 2023 ( Asia Cup 2023 )ప్రారంభం అవ్వడానికి కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఉంది.ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో జరుగనున్న సంగతి తెలిసిందే.
ఈ టోర్నీలో భారత్ తో పాటు నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లు పాల్గొన్నాయి.ఆసియా కప్ 2022లో భారత జట్టు ఫైనల్ కు చేరకుండానే లీగ్ నుంచి నిష్క్రమించింది.
భారత జట్టుకు కొన్ని ప్రధాన సమస్యలు వెంటాడుతున్నాయి.ఈ సమస్యలను సరి చేసుకుంటేనే భారత్ ఆసియా కప్ టైటిల్ తో పాటు వన్డే వరల్డ్ కప్ టైటిల్( ODI World Cup title ) సాధించే అవకాశాలు ఉంటాయి.
భారత్ ప్రధానంగా సరి చేసుకోవలసిన సమస్యలు ఏమిటో చూద్దాం.

భారత జట్టును వెంటాడుతున్న సమస్యలలో ప్రధానమైన సమస్య ఓపెనింగ్ సమస్య.ఐపీఎల్ 2023 అనంతరం శుబ్ మన్ గిల్ ( Shubman Gill )ఫామ్ కోల్పోయాడు.ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే ఆడుతున్నాడు.
బౌలింగ్ అనుకునే పిచ్ లపై పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు.భారత జట్టు ఓపెనింగ్ సమస్య విండీస్ పర్యటనలో చాలా స్పష్టంగా కనిపించింది.
ఈ ఓపెనింగ్ సమస్యను పరిష్కరించుకుంటే భారత్ ఆసియా కప్ టైటిల్ సులభంగా గెలుస్తుంది.

భారత జట్టు బ్యాటింగ్ పరంగా గత కొంతకాలంగా టాప్ ఆర్డర్ పైనే ఆధారపడుతూ వస్తోంది.టాప్-3 బాగా ఆడిన మ్యాచ్లలో మాత్రమే భారత్ విజయం సాధిస్తోంది.భారత జట్టు మిడిల్ ఆర్డర్ పేలవ ఆట ప్రదర్శన చేస్తోంది.
జట్టుకు శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) దూరం కావడంతో ఈ మిడిల్ ఆర్డర్ సమస్య మరింత ఎక్కువైంది.మిడిల్ ఆర్డర్ సమస్యను పరిష్కరించుకుంటే భారత జట్టు వరుస మ్యాచ్లను గెలవగలుగుతుంది.
భారత జట్టుకు బౌలింగ్ కూడా సమస్యగానే మారింది.భారత బౌలర్లు నిలకడ ప్రదర్శించడం లేదు.
ఒక మ్యాచ్ లో అదరగొడితే మరో మ్యాచ్లో పేలవ ఆట ప్రదర్శించి పరుగులు సమర్పించుకుంటున్నారు.భారత జట్టు ఆసియా కప్ గెలవాలంటే బౌలర్లు నిలకడ ప్రదర్శించాలి.







