ఏపీలో ప్రస్తుతం గన్నవరం( Gannavaram ) నియోజిక వర్గానికి సంబంచించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ఎందుకంటే ఇటీవల ఆ నియోజిక వర్గంలోని వైసీపీ కీలక నేత యార్లగడ్డ వెంకట్రావ్( Yarlagadda Venkatarao ) ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.
వైసీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ కవకపోవడంతోనే యార్లగడ్డ పార్టీ మారరానే సంగతి తెలిసిందే.గన్నవరంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) బరిలో నిలవనున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలుపొందిన ఆయన ఆ తరువాత పార్టీ రెబెల్ ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు.ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.
దీంతో ఈ సారి గన్నవరంలో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది.
ఈ నియోజిక వర్గంలో వల్లభనేని వంశీకి తిరుగులేని ఇమేజ్ ఉంది.అలాగని యార్లగడ్డ వెంకట్రావ్ ను తక్కువగా అంచనా వేయడానికి లేదు.గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి ప్రస్తుతం ఆయన గ్రాఫ్ బాగానే పెరిగింది.
ఇక ప్రస్తుతం యార్లగడ్డ టీడీపీ గూటికి చేరగా తాజాగా ఆయనకు నియోజిక వర్గ ఇంచార్జ్ పదవిని కట్టబెట్టింది టీడీపీ( TDP ) అధిష్టానం.దీంతో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి యార్లగడ్డ కు టికెట్ కన్ఫర్మ్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే గనుక జరిగితే గత ఎన్నికల్లో టీడీపీలో గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీలో అప్పుడు వైసీపీ నుంచి ఓడిపోయిన యార్లగడ్డ ఇప్పుడు టీడీపీలో ఉండి పొడి పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం అటు యార్లగడ్డ ఇటు వల్లభనేని వంశీ ఇద్దరు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమాగానే ఉన్నారు.దీంతో గన్నవరం పాలిటిక్స్( Gannavaram Politics ) ఆసక్తికరంగా మారాయి.కాగా గన్నవరం ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో ఊహించడం కష్టం 1955 నుంచి ఈ నియోజిక ప్రజల తీర్పు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది.
కాగా ఎక్కువ సార్లు టీడీపీని ఈ నియోజిక వర్గంలో విజయబావుట ఎగురవేసింది.దాంతో ఈసారి కూడా ఇక్కడ టీడీపీనే గెలుస్తుందని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నారు.అయితే ఈసారి వైసీపీలోకి వల్లభనేని వంశీ ఎంట్రీతో గన్నవరంలో టీడీపీ దూకుడుకు బ్రేకులు వేయాలని చూస్తోంది వైసీపీ.మరి ఈ నియోజిక వర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో చూడాలి.