ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు.టీడీపీ నేత నారా లోకేశ్ వలన తనకు ప్రాణహాని ఉందని పోసాని ఫిర్యాదు చేశారు.
లోకేశ్ తో తనకు ప్రాణహాని ఉందని పోసాని ఆరోపించారు.తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.
ఈ క్రమంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్న ఆయన అన్ని విషయాలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.గతంలో టీడీపీలోకి లోకేశ్ తనను ఆహ్వానించారని, ఈ క్రమంలోనే ఆయన పీఏ ద్వారా కలిసే ప్రయత్నం కూడా చేశారన్నారు.
కానీ తాను టీడీపీలో చేరనని చెప్పడంతో తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు.లోకేశ్ బండారం మొత్తం బయటపెట్టింది తానేనన్న పోసాని తాను అగ్రెసివ్ గా మాట్లాడతా కాబట్టే చంపాలనుకుంటున్నారని వెల్లడించారు.