సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు..: సీఎం జగన్

నంద్యాల జిల్లాలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.ఎనిమిది వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఇదే కావడం విశేషం.

 Job Opportunities Due To Solar Power Project..: Cm Jagan-TeluguStop.com

పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.సోలార్ పవర్ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.

రైతుల ఉచిత కరెంట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దన్న సీఎం జగన్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.మరికొన్ని ప్రాంతాల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందన్నారు.నంద్యాల జిల్లాలోని అవుకు మండలం జానూతల గ్రామంలో 2,300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.

మరోవైపు పాణ్యం మండలంలోని కందికాయపల్లె గ్రామంలో పవన్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.కాగా ఎన్ హెచ్ పీసీ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోలార్, పవన్ విద్యుత్ ప్లాంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube