ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ కు ఎదురుదెబ్బ తగిలింది.దయానంద్ తప్పుడు పద్ధతిలో ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని పొందారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై విచారణ జరిపిన ఎస్సీ కమిషన్ ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించింది.దీంతో ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.అయితే జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటీసులపై దయానంద్ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.2014 వ సంవత్సరంలో వైసీపీ నుంచి పోటీ చేసిన దయానంద్ ఓటమి పాలయ్యారు.తరువాత బీఆర్ఎస్ కు వెళ్లిన ఆయన 2018 లో టికెట్ లభించకపోవడంతో రెండు నెలల క్రితమే హస్తం గూటికి చేరుకున్నారు.వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న దయానంద్ కు క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దుకు నోటీసులు జారీ కావడం సమస్యగా మారింది.







