రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాన( Shiva Nirvana ) దర్శకత్వం లో రూపొందిన ఖుషి సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.హీరోయిన్ గా ఈ సినిమా లో సమంత నటించిన విషయం తెల్సిందే.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఖుషి సినిమా( Kushi movie )కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల జోరు ఓ రేంజ్ లో ఉంటుందని అంతా భావించారు.
కానీ సమంత లేక పోవడం వల్ల అంతా చప్పగా సాగుతోంది.కొన్ని రోజుల క్రితం ఒక వేడుకలో విజయ్ తో కలిసి సమంత పాల్గొంది.

ఆ కార్యక్రమంకు మంచి స్పందన వచ్చింది.అలాగే ఇప్పుడు కూడా విజయ్ తో కలిసి సమంత( Samantha ) మీడియా సమావేశాలకు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాలని కోరుకుంటున్నట్లుగా కొందరు సోషల్ మీడియా ద్వారా ఖుషి మేకర్స్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ఖుషి టీమ్ సందడి చేస్తోంది.అక్కడ కూడా సమంత కనిపించడం లేదు.తాజాగా అమెరికాలో జరిగిక ఒక కార్యక్రమం కోసం సమంత వెళ్లింది.

అక్కడ నుండి రెండు నెలల వరకు ఆమె రాకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటాను అంటూ సమంత బ్రేక్ తీసుకుంది.కనుక ఆమె కు కచ్చితంగా విశ్రాంతి అవసరం కనుక అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
కానీ సమంత టీమ్ మెంబర్స్ మాత్రం మరో రెండు రోజుల్లో సమంత ఇండియాకు రాబోతున్నట్లుగా పేర్కొన్నారు.మరో రెండు లేదా మూడు రోజుల పాటు ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత హాజరు అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
దాంతో ఖుషి మేకర్స్ మరియు అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని, ఇప్పటికే వచ్చిన సినిమా పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి అన్నట్లుగా సోషల్ మీడియా టాక్.
విజయ్ దేవరకొండ( Vijay Deverakonda )కు ఈ సినిమా కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.మరి నిజమేనా చూడాలి.