ఈ మధ్య కాలంలో ప్రముఖ నటి రోజా( Actress Roja ) పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.అయితే సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు ( Senior journalist Imandi Rama Rao )రోజా పవన్ పై చేసిన విమర్శల గురించి మాట్లాడుతూ రోజాకు పిచ్చి పట్టిందని అన్నారు.
నడమంత్రపు సిరిలో ఏమీ కనిపించవని రోజా ఆమే రాజు ఆమే మంత్రి అనుకుంటున్నారని ఇమంది రామారావు తెలిపారు.ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడిన రోజా ఎప్పుడైతే ఆర్థిక పరిపుష్టికి చేరుకున్నారో అప్పటినుంచి ఆవిడ మాటలు దారుణంగా ఉన్నాయని ఇమంది రామారావు తెలిపారు.
రోజా వెనుక ఎవరూ లేరని పవన్ వెనుక లక్షల మంది ఉన్నారని ఇమంది రామారావు కామెంట్లు చేశారు.రోజా వెనుకాముందు చూసుకోవాలని 5 సంవత్సరాల తర్వాత పవర్ పోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు మంచి చేస్తే మాత్రమే వాళ్లు పలకరిస్తారని ఇమంది రామారావు అన్నారు. సీఎం జగన్( cm jagan ) కనుసన్నల్లో ఉంటే గెలుస్తామని రోజా భావిస్తున్నారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

రోజా డిగ్నిఫైడ్ గా ఉండాలని ఇమంది రామారావు పేర్కొన్నారు.రేణూ దేశాయ్( Renu Desai ) మాటలను రోజా తప్పుగా ఎలా తీస్తోందని ఆయన తెలిపారు.తన పిల్లల గురించి కామెంట్లు చేసే రోజా ఫీలవుతుందని మరి అవే కామెంట్లు రేణు దేశాయ్ పిల్లల విషయంలో చేస్తే ఎలా అంటూ ఇమంది రామారావు ప్రశ్నించారు.సీఎం తర్వాత సీఎం అని రోజా ఫీలవుతున్నారని కానీ సొంత పార్టీలోనే ఆమెపై వ్యతిరేకత ఉందని ఇమంది రామారావు కామెంట్లు చేశారు.

టూరిజం మంత్రిగా ఉన్న రోజా తిరుపతిలో చిన్నారి మరణం గురించి ఎందుకు స్పందించలేకపోయారని ఇమంది రామారావు అన్నారు.చేతికో కర్ర ఇస్తే చేతితో కొడితే పులి పోతుందా అని ఆయన కామెంట్లు చేశారు.కర్ర పట్టుకుంటే పులి తనకు అపాయం కలుగుతుందని దాడి చేసే అవకాశం ఉంటుందని ఇమంది రామారావు పేర్కొన్నారు.







