యూత్ స్టార్ నితిన్( Nithin ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.వరుసగా ప్లాప్స్ రావడంతో రేసులో వెనుకబడిన కూడా మళ్ళీ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.
ప్రజెంట్ ఈయన చేస్తున్న ప్రాజెక్టుల్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’( Extra Ordinary Man ) అనే సినిమా ఒకటి.ఈ సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తుండగా ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి అవుతుంది.
ఇక దీంతో పాటు నితిన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు.ఛలో, భీష్మ వంటి రెండు సూపర్ హిట్స్ ను అందుకుని ఫేమస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుములతో( Venky Kudumula ) నితిన్ మరో ప్రాజెక్ట్ కోసం చేయి కలిపాడు.భీష్మ కాంబోలోనే వెంకీ మరో సినిమాను ప్రకటించాడు.‘VNRTrio’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా నితిన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా ఇప్పటికే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.మరి తాజాగా ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒక గెస్ట్ రోల్ ఉండబోతుంది అనే ఇంట్రెస్టింగ్ రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ రోల్ కోసం ప్రముఖ హీరో నటిస్తాడని టాక్ వస్తుంది.అలాగే నితిన్ ఈ సినిమాలో 21 ఏళ్ల యువకుడి రోల్ లో కనిపించనున్నారట.అందుకోసం విఎఫ్ఎక్స్ సహాయం తీసుకోనున్నారు.

నితిన్ లుక్ చాలా సహజంగా ఉండబోతుందని అంటున్నారు.చూడాలి తన వయసు కంటే చాలా చిన్న కుర్రాడిగా నితిన్ ఎలా కనిపిస్తాడో.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
మరి ఈసారి కూడా ఈ కాంబో భీష్మ( Bheeshma ) వంటి హిట్ అందుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.








