స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు.బాలయ్య,( Balakrishna ) జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఒకే సినిమాలో కలిసి కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరిక అనే సంగతి తెలిసిందే.
ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కడంతో పాటు ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు.
అయితే అరవింద సమేత వీర రాఘవ( Aravinda Sameta Veera Raghava ) ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి కనిపించలేదు.
గతంలో ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి( TDP ) ప్లస్ కావచ్చని లేదా మైనస్ కావచ్చని బాలయ్య చేసిన కామెంట్ల వల్ల బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ ఉందేమో అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిన సమయంలో బాలయ్య, తారక్ ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు.

అయితే నందమూరి సుహాసిని( Nandamuri Suhasini ) కొడుకు హర్ష పెళ్లిలో బాలయ్య, తారక్ కలిసి కనిపించడం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య దగ్గరకు వెళ్లి పలకరించారని సమాచారం.ఈ ఫోటో చూసిన నందమూరి ఫ్యాన్స్( Nandamuri Fans ) పండగ చేసుకుంటున్నారు.బాలయ్య, తారక్ కలిసి కనిపిస్తే తమకంటే సంతోషించే వారు ఎవరూ ఉండరని అభిమానులు చెబుతున్నారు.
బాలయ్య, తారక్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాలి.

జనతా గ్యారేజ్ సినిమా విడుదలైన సమయంలో ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రలో బాలయ్య నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.బాలయ్య, తారక్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే ఆ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.







