అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కాలేజ్ ప్రహరీ గోడ నిర్మాణం వివాదాస్పదంగా మారింది.
గోడ నిర్మాణానికి గోతులు తవ్విన కాంట్రాక్టర్ పిల్లర్లు వేశారు.అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తుల రాత్రికి రాత్రే వాటిని పూడ్చివేశారు.
మరోవైపు సుమారు 60 అడుగుల రోడ్డును వదిలి గోడ నిర్మించాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ డిమాండ్ చేశారు.ఈ క్రమంలో జేసీ అనుచరులే పూడ్చి వేసి ఉంటారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కళాశాల ప్రహారీ గోడ వద్దకు ఇరు వర్గాల చెందిన వ్యక్తులు భారీగా చేరుకుంటున్నారు.రంగంలోకి దిగిన పోలీసులు తాడిపత్రిలో 30 యాక్ట్ అమల్లో ఉందని చెబుతున్నారు.
ఇందులో భాగంగానే ప్రహారీ గోడ వద్దకు చేరుకుంటున్న వారిని వెనక్కి పంపి వేస్తున్నారు.







