అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక(Rashmika) హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప (Pushpa)ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లింప్ వీడియో ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.

ఇక ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇకపోతే తాజాగా పుష్ప2 సినిమా( Pushpa 2 ) రిజల్ట్ గురించి వేణు స్వామి(Venu Swamy) చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.వేణు స్వామి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తలు నిలుస్తున్నారు.
అయితే గత రెండు రోజులుగా ఈయన ఆది పినిశెట్టి దంపతులు( Adi Pinishetty ) విడాకులు తీసుకొని విడిపోతారని అలాగే పది సంవత్సరాలపాటు నటుడు అల్లు అర్జున్ కెరీర్ కు ఎలాంటి డోకా లేదు అంటూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి పుష్ప 2 సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుపోతుందనే విషయాల గురించి కూడా తెలియజేశారు.ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ పుష్ప 2 సినిమా విడుదలైన తర్వాత సంచలనం సృష్టిస్తుందని ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు.ఇలా వేణు స్వామి వంటి ఒక వ్యక్తి పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.