వారికి లీడర్లు లేరు - వీరికి క్యాడర్ లేదు!

ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరించే పని చేపట్టిన కాంగ్రెస్పై అధికార పక్షం నుంచి సెటైర్లు పడుతున్నాయి.తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు( Minister Harish Rao ) రెండు పార్టీల నేతలపై విమర్శలు గుప్పించారు.

 Minister Harish Rao Fires On Bjp Congress Parties Details, Minister Harish Rao F-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు – బిజెపికి క్యాడర్ లేదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్( KCR ) చేసిన అభివృద్ధితో ప్రతిపక్షాలకు కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని అందుకే దరఖాస్తులను స్వీకరించి అభ్యర్థులు ఎన్నుకోవాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్( Congress ) ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఈరోజు దరఖాస్తుల పేరుతో సీట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తుందంటూ తీవ్రంగాదుయ్యబట్టారు.

Telugu Bjp Cadre, Bjp, Brs, Cm Kcr, Congress, Harish Rao, Telangana-Telugu Polit

ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న కేసిఆర్ మరొక్కసారి భారీ మెజారిటీతో బారాసా ను( BRS ) అధికారం లోకి తీసుకురావడం రావడం ఖాయం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర భాజపా( BJP ) తీరువలన రాష్ట్రంలో భాజాపాకు కేడర్ కూడా కరువైన పరిస్థితి ఉందని , చాలామంది నాయకులు మా పార్టీలోకి వలస వచ్చేయబోతున్నారంటూ భాజాపా నేతలు చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు కేవలం లేని హైప్ ని క్రియేట్ చేసుకోవడమే కోసమే తప్ప ఎన్ని జాకీలు వేసినా ఆ పార్టీ పైకి లేచే పరిస్థితి లేదంటూ ఆయన విమర్శించారు.

Telugu Bjp Cadre, Bjp, Brs, Cm Kcr, Congress, Harish Rao, Telangana-Telugu Polit

తెలంగాణను అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేసి ప్రజల తలసరి ఆదాయాన్నిపెంచి దేశానికే గర్వకారణం అయ్యే స్థాయిలో తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మరొక్కసారి ఆశీర్వదించే అదికారం అప్పచెబుతారు అన్న నమ్మకం ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.దేశానికి దిశా నిర్దేశం చేసే దిశగా తెలంగాణ( Telangana ) అన్ని రంగాలలోనూ దూసుకెళ్తుందని ఈ అభివృద్ధి కొనసాగాలి అంటే బారాస ప్రభుత్వం మరొకసారి తెలంగాణలో అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు మరి హరీష్ రావు వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube