ఇంకా కొన్ని నెలల్లో తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనుంది.ఈ తరుణంలో బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు వారి స్పీడును పెంచాయి.
ప్రజల ఆశీస్సులు ఎలాగైనా పొందాలని రకరకాల ప్లాన్లు వేస్తూ ముందుకు కదులుతున్నాయి.అధికార బీఆర్ఎస్ ( BRS ) ను దెబ్బ కొట్టాలి అంటే వాక్చాతుర్యం కలిగిన లీడర్, ఎప్పటికప్పుడు ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు కావాలి.
ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పిసిసి బాధ్యతలు అప్పగించింది దీంతో కాంగ్రెస్ లో నయా జోష్ పెరిగింది.ఈ సందర్భంలోనే బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులైన తర్వాత కనీసం ఎక్కడ లేని బీజేపీ, తెలంగాణలో గ్రామ గ్రామాన విస్తరించింది.
ఎంతో పేరు సంపాదించుకుంది.

ఒకానొక సమయంలో బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేది బిజెపి అనే స్థాయికి కూడా వచ్చింది.అంతటి స్థాయికి రావడం కోసం బండి సంజయ్ ( Bandi sanjay ) కూడా ఎంతో కష్టపడ్డారు.ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని బిజెపిని ముందుకు నడిపించారు.
కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేత అయినటువంటి ఈటల రాజేందర్ ( Etela rajender ) బిజెపిలో చేరడంతో బీజేపీలో మరింత జోష్ పెరిగింది.ఇదే తరుణంలో రాష్ట్ర నేతలందరినీ కలుపుకొని బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లో మమేకమౌతూ వచ్చారు.

అప్పుడే పుట్టింది మంట.బిజెపి ( Bjp ) లో కూడా బండి సంజయ్ వర్గం మరియు ఈటల రాజేందర్ వర్గం అనే రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.దీంతో బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తొలగించాలని ఈటల రాజేందర్ బిజెపి అధిష్టానానికి అప్పిలు పెట్టడంతో, అధిష్టానం ఆలోచన చేసింది.అలా కొద్ది రోజుల్లోనే బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించి , కేంద్రమంత్రి సీనియర్ నేత కిషన్ రెడ్డి ( Kishan reddy ) ని నియమించింది.
అప్పటినుంచి బిజెపిలో ఉన్న చాలా మంది యూత్ నాయకులు డిసప్పాయింట్ అయ్యారట.బండి సంజయ్ ఉంటే జోష్ ఉంటుందని, కిషన్ రెడ్డితో అంత ఊపు రాదని భావిస్తున్నారట.
మరి బిజెపి అభిమానుల నైరాశ్యం రాబోయే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.