సూర్యాపేట జిల్లా:కోదాడ మండలంలోని ఎర్రవరం నిన్నటి వరకు ఒక మారుమూల పల్లెటూరు.ఎర్రవరం( Yerravaram kodad temple ) అనే ఒక ఊరు ఉందనే విషయం జిల్లా ప్రజలకే సరిగ్గా తెలియదు.
కానీ,ఆ గ్రామంలో స్వయం యుక్త శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ( Sri Lakshmi Narasimha Swamy )స్వయంభుగా వెలసి, భక్తుల కోరిక కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లడంతో నేడు ఎర్రవరం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.నిత్యం వేలాదిమంది భక్తులతో పల్లె పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నాయి.
భక్తుల ప్రగాఢ విశ్వాసంతో ఇప్పుడు ఎర్రవరం పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతుంది.
ఇక్కడికి వస్తున్న భక్తులు ( Devotees )కోరుకున్న కోరికలు నెరవేరి సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నామని చెప్పడంతో భక్తుల తాకిడి పెరిగింది.
కేవలం ఏడాది కాలంలోనే భక్తుల నమ్మకమే పెట్టుబడిగా అత్యంత ఆదరణ పొందింది.తొలినాళ్లలో రోజుకు పదివేల మంది భక్తుల వచ్చే వారు.నేడు లక్షలాది మంది భక్తులకు నిలయంగా మారి,నిత్య అన్నదాన కేంద్రంగా వర్ధిల్లుతుంది.ఇక్కడకు వచ్చిన భక్తులు తమకు ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతాలు జరిగాయనివిశ్వాసం వెలిబుచ్చడంతో క్రమంగా వీఐపిల తాకిడి కూడా పెరిగింది.
ప్రస్తుతం కోదాడ ఆర్టీసి బస్ డిపో నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఎర్రవరం పుణ్యక్షేత్రానికినడుస్తుంది.ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే భవిష్యత్తులో ఎర్రవరం అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారనుందని భక్తులు భావిస్తున్నారు.








